వాణిజ్యంలో అడ్డంకులు ఉండకూడదు:వాంగ్ యీతో జైశంకర్

by Phanindra |

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జైశంకర్ భేటీ అయ్యారు. వాణిజ్యంలో అడ్డంకులు సృష్టించకూడదని పరోక్షంగా చైనా విధానాలపై చురకలేశారు.

వాణిజ్యంలో అడ్డంకులు ఉండకూడదు:వాంగ్ యీతో జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణంగా మారిన నేపథ్యంలో నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు లేకుండా చేయడంపై ఇరుదేశాలు దృష్టిసారించాలని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్న ఆయన.. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. రెండు దేశాల బంధాలు పాజిటివ్‌గా ముందుకు సాగాలన్న ఆయన.. అభిప్రాయ భేదాలు సమస్యలుగా, పోటీ ఘర్షణగా మారకూడదన్నారు.

వాణిజ్యంపై నియంత్రణలు, అడ్డంకులు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కీలకమైన ఖనిజాల ఎగుమతులను ఇటీవలే చైనా నిలిపివేసిన నేపథ్యంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు ఐదేళ్ల తర్వాత చైనాకు జైశంకర్ వెళ్లారు.

ఈ సందర్భంగా 2024 అక్టోబర్ 23న ప్రధాని మోడీ-జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశాన్ని గుర్తుచేసిన ఆయన.. ‘ఇరుదేశాల నేతల సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు పాజిటివ్ దిశలో వెళ్తున్నాయి. వాటిని వేగవంతం చేయడం మన బాధ్యత’ అని వాంగ్ యీకి చెప్పారు. భారత్-చైనా మధ్య నిలకడైన, నిర్మాణాత్మక సంబంధాలు ప్రపంచానికే మేలు చేస్తాయన్నారు.

Next Story