- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 15 నుంచి యూకేలో ఈ-వీసాలు అమలు
ఇంగ్లాండ్ వీసాదారులకు బిగ్ అలర్ట్. జులై 15, 2025 నుంచి యూకేలో (United Kingdom) సంప్రదాయ స్టాంప్ వీసాలను (Visa) తొలగిస్తూ, వాటి స్థానంలో ఈ-వీసా (eVisa) వ్యవస్థను తీసుకొస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ వీసాదారులకు బిగ్ అలర్ట్. జులై 15, 2025 నుంచి యూకేలో (United Kingdom) సంప్రదాయ స్టాంప్ వీసాలను (Visa) తొలగిస్తూ, వాటి స్థానంలో ఈ-వీసా (eVisa) వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఈ కొత్త విధానం ప్రకారం, వీసాలు ఇకపై పాస్‌పోర్టుతో డిజిటల్‌గా లింక్ అయి ఉంటాయి. ఈ మార్పు అన్ని రకాల వీసాలపై వర్తించనుండగా, ముఖ్యంగా భారతీయ విద్యార్థులపై ఇది అత్యధిక ప్రభావాన్ని చూపనుంది.
అసలేంటి ఈ వీసా?
సాధారణంగా వీసా మంజూరైన తర్వాత దరఖాస్తుదారులు తమ UKVI ఖాతాను (UK Visas and Immigration Account) సృష్టించుకొని, వీసా సమాచారాన్ని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు వివరాలు, అప్‌డేట్లు, రెన్యూవల్స్ వంటివన్నీ ఈ ఖాతాలో నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యాసంస్థలు, యజమానులు, ల్యాండ్‌లార్డులు వంటి వారు ఈ ఖాతా ద్వారా వీసా స్థితిని తనిఖీ చేయగలుగుతారు.
ఇది పూర్తి డిజిటల్ వ్యవస్థ అయినా కూడా, ప్రయాణ సమయంలో విద్యార్థులు తమ పాస్‌పోర్టును, వీసా డెసిషన్ లెటర్‌ను ప్రింట్ తీసుకొని లేదా డిజిటల్ కాపీగా తీసుకెళ్లాలి. UK బోర్డర్ ఆఫీసర్లు పాస్‌పోర్టు స్కాన్ చేసి, ఈవీసా వివరాలను ధ్రువీకరిస్తారు. ఈ మార్పులతో వీసా ప్రక్రియ మరింత సాంకేతికంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ముందుగానే అన్ని వివరాలను సరిచూసుకుని తమ ప్రయాణాన్ని సురక్షితంగా ప్లాన్ చేసుకోవాలి.
యూకే వెళ్లే వారు తప్పనిసరిగా పాటించాల్సినవి:
UKVI ఖాతా తప్పనిసరిగా సృష్టించుకోవాలి.
పాస్‌పోర్ట్ సమాచారం అప్‌డేట్ చేయాలి.
వీసా డెసిషన్ లెటర్‌ను సేవ్ చేసుకోవాలి.
ప్రయాణానికి ముందు వీసా లింకేజీని ధ్రువీకరించాలి.






