- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Baba: "దుబాయ్ షేక్‌కు సెక్స్ పార్ట్‌నర్ కావాలి" ఢిల్లీ బాబా షాకింగ్ వాట్సాప్ చాట్స్ లీక్
విద్యార్థినులను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై అరెస్టు అయిన ఢిల్లీ బాబా కేసులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఢిల్లీ శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ (Delhi Sharda Institute of Indian Management) డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి (Swami Chaitanyananda Saraswati) (స్వామి పార్థసారథి) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో దుబాయ్ షేక్‍ల (Dubai Sheikh) వ్యవహారం తెరపైకి వచ్చింది. కేసులో భాగంగా చైతన్యానంద సరస్వతిని అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు అతడి ఫోన్‍ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ నిండా బూతు ఫోటోలు బూతు చాటింగ్‍లే ఉన్నాయని గుర్తించారు. ఈ క్రమంలో ఆయన వాట్సాప్ లో యువతులతో జరిపిన సంభాషణలు పోలీసులను సైతం నివ్వెరపోయేలా చేస్తోంది. జాతీయ మీడియా కథనం ప్రకారం చైతన్యానంద సరస్వతి ఫోన్‍లో దొరికిన ఓ చాటింగ్ స్క్రీన్ షార్ట్ ఆయన ఇంటర్నెషనల్ స్థాయిలో ఆమ్మాయిలను సరఫరా చేసే నెట్ వర్క్ మెయింటెన్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దుబాయ్ షేక్‌కి సెక్స్ పార్ట్‌నర్ కావాలి:
తన ఆధీనంలో ఉన్న విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినితో బాబా సాగించినట్లుగా చెప్పబడుతున్న చాటింగ్‍లో షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఈ స్క్రీన్ షార్ట్ ప్రకారం చాటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ బాబా: 'దుబాయ్ షేక్ ఒకరు తనకు సెక్స్ పార్టర్నర్ కావాలని అడుగుతున్నారు. అందుకు అనువుగా నీకు తెలిసిన ఎవరైనా మంచి స్నేహితులు ఉన్నారా?
విద్యార్థిని: 'కోయీ నహిహై'(ఎవరూ లేరు)
ఢిల్లీ బాబా: హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
విద్యార్థిని: ఐ డోంట్ నో
ఢిల్లీ బాబా: నీ క్లాస్ మేట్ ఎవరైనా? జూనియర్ ఎవరైనా? (నీకు తెలిసినవారిలో ఉన్నారేమో చూడు అన్నట్లు)
మరో చాట్‍లో చైతన్యానంత పదే పదే ఒక విద్యార్థినిని 'స్వీటీ బేబీ డాటర్ డాల్' అని సంభోధిస్తూ ఆమెతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా చాట్ చేసినట్లు గుర్తించారు. ఈ చాట్ లో
'బేబీ' (7:49PM)
'బేబీ వేర్ ఆర్ యూ' (11:59 PM)
'గుడ్ మార్నింగ్ బేబి' (12:40)
'నామీద నీకు ఎందుకు కోపం? అంటూ చాట్ చేశారు.
మరో చాట్ లో గుడ్ ఈవెనింగ్ మై మోస్ట్ బిలవెడ్ బేబీ డాటర్ డాల్' అని మేసేజ్ పంపగా అవతలి వైపు నుంచి హియర్ ఆఫ్టర్నూన్ సర్, హ్యాపీ ఆఫ్టర్నూన్. డిడ్ యూ హ్యావ్ సమ్ థింగ్ సర్? అని రిప్లయ్ వచ్చింది. మరో చాట్‍లో చైతన్యానంద సరస్వతి 'డిస్కో డాన్స్ చేస్తున్నాను' నాతో జాయిన్ అవుతారా? అని అడుగుతాడు. అందుకు అవతలి వైపు నుంచి 'వావ్ సార్ ఆసమ్' అంటూ బుదులు వచ్చింది. మరో చాట్‍లో మరో విద్యార్థినితో నువ్వు ‘నాతో పడుకుంటావా’ అని బాబా సందేశం పంపించాడు. ఈ చాటింగ్ లకు సంబంధించిన స్క్రీన్ షార్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. చైతన్యానంద సరస్వతి కేసులో అంతర్జాతీయ స్థాయి వరకు లింకులు ఉన్నాయనే టాక్ వినిపిసిస్తోంది. దీంతో ఈ కేసును మరింత పకడ్బందీగా విచారణ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.






