అక్రమ వలసదారులకు DSH ఆఫర్

by Muthe.Rajitha |

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

అక్రమ వలసదారులకు DSH ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ట్రంప్ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 31లోపు స్వచ్ఛందంగా యూఎస్‌ను విడిచిపెడితే ఇచ్చే బోనస్‌ను మూడు రెట్లు పెంచినట్లు తెలిపింది. ఇప్పటివరకు 1,000 డాలర్లుగా ఉన్న ఈ ప్రోత్సాహకాన్ని తాజాగా 3,000 డాలర్లకు పెంచింది. అంతేకాకుండా, స్వదేశానికి వెళ్లేందుకు ఉచిత విమాన టికెట్‌ సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు DHS వెల్లడించింది. అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

Next Story