కిక్కురేగిన తాగుబోతు.. ఏకంగా ఎస్సై కుర్చీలోనే కూర్చుని హల్ చల్

by Ajay Maddhiboyina |

కిక్కు ఎక్కువైతే తాగుబోతులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఎక్కడికి వెళ్లేందుకైనా.. ఏ పనిచేసేందుకైనా వెనకాడరు. తాజాగా ఓ తాగుబోతు అలాంటి పనే చేసి వార్తల్లో నిలిచాడు. పోలీస్ స్టేష‌న్ లో ఎస్సై కుర్చీ కాళీగా కనిపించ‌డంతో నేరుగా వెళ్లి అందులో కూర్చుని హ‌ల్ చ‌ల్ చేశాడు.

కిక్కురేగిన తాగుబోతు.. ఏకంగా ఎస్సై కుర్చీలోనే కూర్చుని హల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్: కిక్కు ఎక్కువైతే తాగుబోతులు ఏం చేస్తారో వారికే తెలియదు. ఎక్కడికి వెళ్లేందుకైనా.. ఏ పనిచేసేందుకైనా వెనకాడరు. తాజాగా ఓ తాగుబోతు అలాంటి పనే చేసి వార్తల్లో నిలిచాడు. పోలీస్ స్టేష‌న్ లో ఎస్సై కుర్చీ కాళీగా కనిపించ‌డంతో నేరుగా వెళ్లి అందులో కూర్చుని హ‌ల్ చ‌ల్ చేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని హాపూర్ జిల్లా దోయ‌మి పోలీస్ స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ లో మధ్యాహ్నం సమయంలో ఎస్సై, సిబ్బంది భోజనం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఎస్సై తన టోపీ తీసి కుర్చీపైనే పెళ్లి వెళ్లారు. అయితే అదే సమయంలో పోలీస్ స్టేషన్ వైపు వచ్చిన ఓ తాగుబోతుకు స్టేషన్ లో ఎవరూ కనిపించకపోవడం, కుర్చీ ఖాళీగా ఉండటంతో నేరుగా వెళ్లి అందులో కూర్చున్నాడు.

అంతటితో ఆగకుండా కర్చీపై కనిపించిన టోపీని పెట్టుకుని అక్కడ ఉన్న ఫైల్స్ అన్ని చింపివేస్తూ హల్ చల్ చేశాడు. ఎస్సై సీటులో తాగుబోతు కూర్చుని హల్ చల్ చేస్తున్నప్పుడే ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు రాగా అతడు తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో తాగుబోతు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీస్ శాఖపై తీవ్రవిమర్శలు వచ్చాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ ఆ పోలీస్ స్టేషన్ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకుంటూ ఎస్సైని, సిబ్బందిని సస్పెండ్ చేశారు.

Next Story