- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో పట్టాలపై ఆటో నిలిపిన డ్రైవర్.. వందే భారత్ కు ప్రమాదం
ఓ వ్యక్తి తప్పతాగి తన ఆటోను ఏకంగా రైలు పట్టాలపై నిలిపాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ వ్యక్తి తప్పతాగి తన ఆటోను ఏకంగా రైలు పట్టాలపై నిలిపాడు. అటుగా వస్తున్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోకో పైలట్ అప్రమత్తతో రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కేరళలో కాసర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నిన్న రాత్రి 10:10 గంటల సమయంలో వర్కల సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆటో నిలిపి ఉండటాన్ని గమనించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో రైలు ఆటోను తాకినప్పటికీ మేజర్ యాక్సిడెంట్ జరగలేదు. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ ట్రాక్‌పై ఆటోను నిలిపడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకోగా, రైలు ఆగిన వెంటనే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనతో రైలు దాదాపు గంటపాటు నిలిచిపోగా.. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అలాగే ఆ రూట్లో రైళ్లన్నీ 2 గంటల ఆలస్యంగా నడిచాయి. రైల్వే పోలీస్ (RPF), స్థానిక పోలీసులు ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు గాని, రైలు సిబ్బందికి ఎలాంటి గాయాలు జరగలేదు. లోకోపైలట్ అప్రమత్తతను రైల్వే అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు.






