మద్యంమత్తులో ఆర్మీ అధికారి నిర్వాకం.. చావు దెబ్బలతో ఆస్పత్రిపాలు

by Naga Rani Yarlagadda |

మద్యంమత్తులో ఆర్మీ అధికారి చేసిన పని స్థానికుల చేతిలో చావుదెబ్బలు తిని, ఆస్పత్రి పాలయ్యేలా చేసింది.

మద్యంమత్తులో ఆర్మీ అధికారి నిర్వాకం.. చావు దెబ్బలతో ఆస్పత్రిపాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యంమత్తులో ఆర్మీ అధికారి చేసిన పని స్థానికుల చేతిలో చావుదెబ్బలు తిని, ఆస్పత్రి పాలయ్యేలా చేసింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాగ్ పుర్ లో ఆర్మీ అధికారి హర్ష్ పాల్ మహదేవ్ (40) ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో నాగర్ధాన్లోని దుర్గాచౌక్ మీదుగా హమ్లాపురికి కారులో పయనమయ్యాడు. అప్పటికే హర్ష్ పాల్ మద్యం సేవించి ఉన్నాడు. మార్గంమధ్యలో కారుపై నియంత్రణ కోల్పోయి ఆ దారిలో వెళ్తున్న 30 మంది పాదచారులను ఢీ కొట్టారు. ఆపై కారు బోల్తాపడి రోడ్డుపక్కన ఉన్న కాలువలో పడిపోయింది. దీంతో స్థానికులు హర్ష్ పాల్ మహదేవ్ ను కాలువ నుంచి బయటకు తీసి, మద్యంమత్తులో కారు నడిపినందుకు గాను క్షతగాత్రుల బంధువులు, స్థానికులు చితకబాదారు.

ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హర్ష్ పాల్ మహదేవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరంతో అతనితో పాటు, కారు ఢీకొని గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా.. అతను అస్సాంలోని భారత సైన్యంలో పనిచేస్తున్నాడని, నాలుగు రోజులు సెలవులు కావడంతో తన స్వగ్రామమైన సూరాదేవి గ్రామానికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story