- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.20 కోట్ల విలువైన గంజాయి పట్టివేత.. ఎక్కడంటే?
ఆదివారం ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల విలువ చేసే 20 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) భారీగా గంజాయి పట్టుబడింది. ఆగస్టు 7వ తేదీన ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల విలువ చేసే 20 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ యువకుడి లగేజ్ తనిఖీ చేయగా, గంజాయి బయటపడింది. ఈ మత్తు పదార్థాన్ని 20 వెక్యూమ్ పాలిథీన్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద యువకుడిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మొత్తం గంజాయిని ఎక్కడి తరలిస్తున్నాడని, ఆ యువకుడి వెనుక ఎవరెవరకు ఉన్నారు అనే విషయాలు తెలుసుకునేందుకు యువకుడి విచారిస్తున్నారు.
Next Story






