- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్నేషనల్ డ్రగ్స్ నెట్‌వర్క్ భగ్నం: రూ.182 కోట్ల విలువైన సరుకు సీజ్
దేశంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లను అణచివేసే క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సరికొత్త రికార్డు సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లను అణచివేసే క్రమంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్న, జిహాది డ్రగ్స్‌గా పిలవబడే క్యాప్టగాన్ డ్రగ్ కన్స్తైన్‌మెంట్‌ను భారత ఏజెన్సీలు మొదటిసారిగా పట్టుకున్నాయి. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.182 కోట్లు ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం అధికారికంగా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. ఈ భారీ డ్రగ్స్ ముఠాను పట్టుకోవడానికి ఎన్‌సీబీ ప్రత్యేకంగా ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారీ ఎత్తున తరలిస్తున్న క్యాప్టగాన్ డ్రగ్‌ను అధికారులు విజయవంతంగా అడ్డుకున్నారు. ఈ డ్రగ్స్ కన్స్తైన్‌మెంట్‌ను పశ్చిమ ఆసియా దేశాలకు తరలించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఒక విదేశీ పౌరుడిని కూడా ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
అమిత్ షా కీలక ప్రకటన..
ఈ చారిత్రాత్మక విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ‘డ్రగ్స్ రహిత భారత్’ను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన పునరుద్ఘాటించారు. ‘మన ఏజెన్సీలు ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ ద్వారా సుమారు రూ.182 కోట్ల విలువైన జిహాది డ్రగ్స్‌ను మొదటిసారి సీజ్ చేశాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్న ఈ డ్రగ్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడం, ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం.. డ్రగ్స్2పై మన ప్రభుత్వం అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానానికి నిదర్శనం అని అమిత్ షా పేర్కొన్నారు.






