Drugs Seiz : ముంబైలో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

by Muthe.Rajitha |

మహారాష్ట్ర(Maharashtra)లో మరోసారి భారీగా డ్రగ్స్(Drugs) పట్టుకున్నారు పోలీసులు.

Drugs Seiz : ముంబైలో రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra)లో మరోసారి భారీగా డ్రగ్స్(Drugs) పట్టుకున్నారు పోలీసులు. ముంబైలోని ఛత్రపతి విమానాశ్రయం(Mumbai Airport) నుంచి మాదకద్రవ్యాలు అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం అందడంతో.. నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు. కార్గో విమానాలను తనిఖీ చేసిన అనంతరం.. అనుమానం కలిగిన ప్రతీ ఒక్కరిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ డ్రగ్ పెడ్లర్ నుంచి 1.18 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సినీ ఫక్కీలో పొట్టలో క్యాప్సూల్ రూపంలో కొకైన్(Cocaine) ను పొట్టలో దాచి విదేశాలకు తరలించే ప్రయత్నం చేయగా.. సర్జరీ చేసి డ్రగ్స్ ను బయటికి తీయించారు అధికారులు.

కాగా ఈ డ్రగ్స్ విలువ మార్కెట్లో దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇదే మొదటిసారి అని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ డ్రగ్స్ ఎవరు సప్లయ్ చేస్తున్నారు, విదేశాల్లో ఎవరికి చేరవేస్తున్నారు అని నార్కోటిక్ అధికారులు ఆరా తీస్తున్నారు.

Next Story