- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shine Tom Chacko : డ్రగ్స్ రైడ్.. పారిపోయిన ప్రముఖ నటుడు
ఓ హోటల్ లో డ్రగ్స్(Drugs) వినియోగిస్తున్నారని అనుమానం రావడంతో పోలీసులు రైడ్(Drugs Ride) చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ హోటల్ లో డ్రగ్స్(Drugs) వినియోగిస్తున్నారని అనుమానం రావడంతో పోలీసులు రైడ్(Drugs Ride) చేశారు. అయితే పోలీసులు రైడ్ కు వస్తున్నారనే విషయం తెలిసి అదే హోటల్ లో ఉన్న ఓ ప్రముఖ నటుడు ఉన్నపలంగా పారిపోయాడు. ఈ ఘటన (Kerala)కొచ్చిలో చోటు చేసుకుంది. కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు నార్కోటిక్ పోలీసులు ఆ హోటల్ మీద రైడ్ చేయగా.. మలయాళ ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో(Shine Tom Chacko) అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
హోటల్ మూడవ అంతస్తు నుంచి దూకి పారిపోయినట్లు వారు తెలిపారు. అయితే దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా గతంలో ఓసారి సినిమా సెట్ లోనే డ్రగ్స్ తీసుకొని తనపై అసభ్యంగా ప్రవర్తించినట్టు ఓ నటి కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర దూమరాన్ని రేపాయి.






