IIT Baba : ఐఐటీ బాబాపై డ్రగ్స్ కేసు నమోదు

by Muthe.Rajitha |

ఇటీవల జరిగిన ప్రయాగ్ రాజ్ మహకుంభమేళా(PrayagRaj MahaKumbhmela) వేడుకల్లో ఐఐటీ బాబా(IIT Baba) పేరుతో ఓ వ్యక్తి తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

IIT Baba : ఐఐటీ బాబాపై డ్రగ్స్ కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన ప్రయాగ్ రాజ్ మహకుంభమేళా(PrayagRaj MahaKumbhmela) వేడుకల్లో ఐఐటీ బాబా(IIT Baba) పేరుతో ఓ వ్యక్తి తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అభయ్ సింగ్(Abhay Singh) అలియాస్ ఐఐటీ బాబాపై తాజాగా నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ కేసు(Drugs Case) నమోదు చేశారు. ఇటీవల జైపూర్ లో జరిగిన ఓ గొడవలో.. ఐఐటీ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకొని, అతని నివాసంలో సోదాలు జరిపారు. అతని ఇంట్లో పోలీసులకు గంజాయి లభించడంతో ఐఐటీ బాబాపై డ్రగ్స్ (ఎన్డీపీఎస్) (NDPS)కేసు నమోదు చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఐఐటీ బాబాను పోలీసులు విడుదల చేయడం గమనార్హం. అయితే హరియాణకు చెందిన అభయ్ సింగ్.. ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసినట్టు చెప్పుకున్నాడు. అనంతరం ఆధ్యాత్మికం వైపు వెళ్ళి.. బాబాగా అవతారం ఎత్తాడు. ఇటీవల జరిగిన కుంభమేళాలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ ఐఐటీ బాబా హాల్ చల్ చేయగా.. ఇపుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయడం సంచలనంగా మారింది.

Next Story