- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్‌కతాలో అనుమానాస్పద డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు
పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కేంద్రం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే కోల్‌కతా (Kolkata) నగరంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం నగర గగనతలంపై రాత్రి 8 నుంచి 10 గంటల ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్లు తిరుగుతుండటంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఆ డ్రోన్స్ నగరంలోని హేస్టింగ్స్ (Hastings), విద్యాసాగర్ సేతు (Vidyasagar Bridge), ఫోర్ట్ విలియం (Fort William), పార్క్ సర్కస్ (Park Circus) ప్రాంతాల్లో మొదట గుర్తించారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కోల్‌కతా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (STF), డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ విచారణను ప్రారంభించాయి. డ్రోన్లు ఎవరు ఎగురవేశారు, ఇతర దేశాలకు గూఢచర్యం చేస్తున్న వారి పనేనా అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. రాత్రి వేళ ఆకాశంలో డ్రోన్లు ఎగురుతుండటం హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారని పేర్కొన్నారు. ఆ అనుమానాస్పద డ్రోన్లు పరగణాల జిల్లాలోని మహేష్తలా దిశగా నగరంలోకి ఎంటర్ అయ్యాయని తెలిపారు. సరిగ్గా అవి పార్క్ సర్కస్ ప్రాంతంలోకి రాగానే అదృశ్యమైనట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. తాము అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నామని.. నగర భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కోల్‌కతా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది.






