రియాద్‌‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి.. భారీ పేలుళ్లు, చెలరేగిన మంటలు

by Kema Shiva Kumar |

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన డ్రోన్ దాడిలో భారీ పేలుళ్లు సంభవించి మంటలు చెలరేగాయి.

రియాద్‌‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి.. భారీ పేలుళ్లు, చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) లక్ష్యంగా ఇవాళ తెల్లవారుజామున భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయ ప్రాంగణంలో మంటలు చెలరేగగా, భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. రెండు డ్రోన్లు దౌత్య ప్రాంతం (Diplomatic Quarter)లోని ఎంబసీని తాకాయి. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. కేవలం స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లింది.

కాగా, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలే కువైట్‌లోని అమెరికా ఎంబసీపై కూడా ఇలాంటి దాడులే జరిగాయి. అయితే, తాజాగా ఎంబసీపై దాడిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీనికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

Next Story