గవర్నమెంట్ టీచర్లకు ఇకపై వీక్లీ డ్రెస్‌కోడ్.. అధికారులకు ఆదేశాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-01 15:15:50  IST  )

చండీగఢ్ గవర్నమెంట్ స్కూళ్లలో (Chandigarh Government Schools)ని ప్రిన్సిపల్స్ సహా టీచర్లందరూ డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

గవర్నమెంట్ టీచర్లకు ఇకపై వీక్లీ డ్రెస్‌కోడ్.. అధికారులకు ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : స్కూళ్లలో విద్యార్థులంతా యూనిఫాం వేసుకున్నట్లే.. ఇకపై అన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లందరికీ వారానికి ఒకరోజు డ్రెస్ కోడ్ (Dress Code for Teachers) ఉంటుందని చండీగఢ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ విధానం వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. చండీగఢ్ గవర్నమెంట్ స్కూళ్లలో (Chandigarh Government Schools)ని ప్రిన్సిపల్స్ సహా టీచర్లందరూ డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఈ తరహా చొరవ ఇదే తొలిసారి అని, టీచింగ్ సిబ్బందిలో వృత్తి నైపుణ్యం, అందరూ ఒకటేనన్న భావన, విజువల్ ఐడెంటిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డ్రెస్ కోడ్ గైడ్ లైన్స్ ను విడుదల చేశారు.

జంట్స్ బ్లూ కలర్ ఫార్మల్ షర్ట్, గ్రే కలర్ ప్యాంటు, మహిళా టీచర్లు గోధుమరంగు చీరలు లేదా మెరూన్ బోర్డర్ తో ఉండే సల్వార్ - కమీజ్ వేసుకోవాలి. ప్రిన్సిపల్స్ జంట్స్ అయితో గ్రే కలర్ ప్యాంట్ - వైట్ షర్ట్, ఉమెన్ ప్రిన్సిపల్స్ అయితే లైట్ గోధుమరంగు చీరలు లేదా గోల్డ్ బార్డర్ ఉన్న సల్వార్ - కమీజ్ వేసుకోవాలని గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.

Next Story