- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూఢచర్యం ఆరోపణలు.. DRDO గెస్ట్ హౌస్ మేనేజర్ అరెస్ట్
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం.. దేశంలోని గూఢచర్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం (Government of India).. దేశంలోని గూఢచర్యంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దేశంలో ఉంటూ కీలక సమాచారాలను శత్రు దేశాలకు, ఉగ్రవాదలుకు చేరవేస్తున్న వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో పలువురు అధికారులను సైతం అరెస్ట్ చేశారు. తాజాగా గూఢచర్య ఆరోపణలు రావడంతో రాజస్థాన్ DRDO గెస్ట్ హౌస్ మేనేజర్ (Rajasthan DRDO Guest House Manager)ను నిఘా సంస్థలు ఈ రోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్ కు చెందిన మహేంద్ర ప్రసాద్ (Mahendra Prasad)గా అధికారులు గుర్తించారు. అతను డీఆర్‌డీఓ (DRDO) సంస్థకు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఘా సంస్థలు (Surveillance agencies) మహేంద్ర ప్రసాద్ పై.. నిఘా పెట్టిన అధికారులు.. అతని కదలికల్లో అనుమానాలు గుర్తించారు. అనంతరం అతను భారత అణు పరీక్షల కీలక ప్రదేశాలను పాక్ కు లీక్ చేసినట్లు అనుమానం రావడంతో అతన్ని ఈ రోజు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.






