- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DRDO: డీఆర్డీఓ ఎయిర్ డిఫెన్స్ టెస్ట్ సక్సెస్.. అభినందనలు తెలిపిన రాజ్‌నాథ్ సింగ్
దేశీయంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ కు చెందిన విమాన పరీక్షను డీఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశీయంగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS)కు చెందిన తొలి విమాన పరీక్షను డీఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలో ఈ నెల 23న ప్రయోగం చేపట్టింది. ఈ టైంలో ఈ సిస్టమ్ ఒకేసారి మూడు వేర్వేలు లక్ష్యాలపై దాడి చేసిందని, ఈ టార్గెట్స్ వేర్వేరు దూరాలు, ఎత్తులలో ఉన్నాయని డీఆర్డీఓ తెలిపింది. అన్నింటినీ ఓకేసారి టార్గెట్ చేసి ధ్వంసం చేసిందని పేర్కొంది. కమ్యూనికేషన్, రాడార్‌లతో సహా అన్ని ఆయుధ వ్యవస్థ భాగాలు మెరుగైన పనితీరు కనబర్చాయని వెల్లడించింది. దీంతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బూస్ట్ లభించినట్టు అయింది. ఈ వ్యవస్థ సక్సెస్‌తో విదేశీ రక్షణ వ్యవస్థలపై భారత్ ఆధారపడటం తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎల్ఏడీడబ్లూఎస్ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్ సింగ్ డీఆర్డీఓను ప్రశంసించారు. ‘ఎల్ఏడీడబ్లూఎస్ ను సక్సెస్ ఫుల్‌గా అభివృద్ధి చేసినందుకు డీఆర్డీఓకు అభినందనలు. ఈ ప్రత్యేకమైన విమాన పరీక్ష మన దేశ మల్డీ లేయర్‌డ్ వాయు రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. శత్రువుల వైమానిక ముప్పులకు వ్యతిరేకంగా ప్రాంతీయ రక్షణను బలోపేతం చేయబోతుంది’ అని పేర్కొన్నారు.
ఎల్ఏడీడబ్లూఎస్ అంటే?
ఎల్ఏడీడబ్లూఎస్ అనేది దేశీయంగా అభివృద్ధి చేయబడిన మల్డీ లేయర్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో అన్ని స్వదేశీ క్విక్ యాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ క్షిపణులు, అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్షిపణులు, హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ఉన్నాయి. ఇది ఒకేసారి అనేక లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఎక్కువ ఎత్తులో ఉన్న టార్గెట్స్‌ను సైతం ఎదుర్కోగలదు.






