- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dr Mathew Kalarickal: భారత 'యాంజియోప్లాస్టీ పితామహుడు' డా. మాథ్యూ కలరికల్ కన్నుమూత
గుండె జబ్బులు ఉన్నవారికి యాంజియోప్లాసీ ప్రక్రియను నిర్వహించడానికి ఒక తరం వైద్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఘనత సాధించారు

దిశ, నేషనల్ బ్యూరో: భారత యాంజియోప్లాస్టీకి మార్గదర్శకుడు, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ శామ్యూల్ మాథ్యూ కలరికల్(77) శుక్రవారం మరణించారు. గుండె జబ్బులు ఉన్నవారికి యాంజియోప్లాసీ ప్రక్రియను నిర్వహించడానికి ఒక తరం వైద్యులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆయన ఘనత సాధించారు. ఈ కారణంగానే ఆయనకు భారత యాంజియోప్లాస్టీ పితామహుడనే పేరు వచ్చింది. ఆయన కృషికి గానూ వైద్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం డాక్టర్ బీసీ రాయ్ అవార్డును 1996లో, 2000లో పద్మశ్రీ అందుకున్నారు. గత నెలరోజులుగా ఆయన వయసు కారణంగా ఆరోగ్యం క్షీణించినప్పటికీ, రోగులకు చికిత్స అందించారు. కేరళలోని కోట్టాయం జిల్లాలో జన్మించిన డాక్టర్ శామ్యూల్ కలరికల్, అక్కడే ప్రభుత్వం వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. అనంతరం చెన్నైలోని ప్రఖ్యాత మెడికల్ కాలేజీ, మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యూయేషన్, స్పెషలైజేషన్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, డాక్టర్ కలరికల్ విదేశాల్లో కన్సల్టెంట్‌గా పనిచేశారు. అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో యాంజియోప్లాస్టీ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆండ్రిస్ గ్రుఎంట్‌జిగ్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత 1985లో భారత్‌కు తిరిగి వచ్చి యాంజియోప్లాస్టీ ప్రారంభించారు. ఇది ఇప్పుడు గుండె జబ్బులకు నిర్వహించే సాధారణ ప్రక్రియగా మారింది. ఆయన వృత్తి జీవితంలో ఎంతోమంది రోగుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆయన వద్ద చికిత్స పొందించ చాలామంది తమ జీవితంలో ఆయన చికిత్స విధానాన్ని మర్చిపోలేమని చెబుతుంటారు. యాంజియోప్లాస్టీ విషయంలో భారత్‌ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత డాక్టర్ కలరికల్‌దేనని డాక్టర్ మల్లుసరి తెలిపారు.






