- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్యానాలో ఆప్, కాంగ్రెస్ పొత్తుపై సందిగ్ధత!
హర్యానా రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎనికలు జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: హర్యానా రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎనికలు జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వివిధ పార్టీలు తమ అభ్యర్థులను సైతం ప్రకటించేస్తున్నారు. కానీ ఇండియా కూటమిలో మాత్రం సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ ఇంకా తెగకపోవడంతో.. అయోమయం నెలకొంది. దీంతో ఈ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది.
హర్యానా రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లుంటే.. దీంట్లో ఆప్ 20 సీట్లను ఆశిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ, ఆప్ కు అన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ సీట్ల పంపకం గురించి మంగళవారం జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) సమావేశంలో ప్రస్తావన వచ్చింది. ఈ సమావేశంలో ఆప్ పోటీ చేసే స్థానాల జాబితాను, కాంగ్రెస్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఈ జాబితా అందితే గానీ ఆప్ కు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే దానిపై స్పష్టత వస్తుంది. ఇదిలా ఉండగా హర్యానాలో ఆప్ తో పొత్తుకు మాత్రం రాహుల్ గాంధీ సుముంఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్ కు 20 సీట్లు కాకుండా.. కొన్ని సీట్లు తగ్గించి ఇచ్చేలా ఆప్ నేతలతో కాంగ్రెస్ మంతనాలు జరుపుతోంది. అయితే ఇరుపార్టీలు హర్యానాలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి.






