వాహనదారులకు షాక్.. అలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా డబుల్

by Ajay Maddhiboyina |

వాహనదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రోడ్డు భద్రతను మెరుగుపర్చాలనే ఉద్ధేశ్యంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చింది.

వాహనదారులకు షాక్.. అలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా డబుల్
X

దిశ, వెబ్ డెస్క్: వాహనదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. రోడ్డు భద్రతను మెరుగుపర్చాలనే ఉద్ధేశ్యంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ తీసుకువచ్చింది. 18ఏళ్ల కంటే తక్కవ యవసు ఉన్న బాల బాలికలు వాహనంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు అవుతుందని ప్రకటించింది. ఈ నిబంధన నేటి నుండే అమలులోకి వచ్చింది.

చిన్నపిల్లలు ఉన్నప్పుడు సీట్ బెల్డ్ ధరించకపోవడం, స్పీడ్ లిమిట్ దాటడం, ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేయడం ఇలా ఏ నియమాన్ని ఉల్లంఘించినా సాధారణంగా వేసే జరిమానాతో పాటు అదనంగా పడుతుందని తెలిపింది. ఉదాహరణకు కార్ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే రూ.1000 ఫైన్ వేస్తారు. తాజాగా తీసుకువ‌చ్చిన రూల్స్ ప్ర‌కారం అది డ‌బుల్ అవుతుంది. అంటే వాహ‌నంలో పిల్ల‌లు ఉంటే రూ.2వేలు జ‌రిమానా క‌ట్టాల్సిందే. కాబ‌ట్టి ట్రాఫిక్ రూల్స్ త‌ప్ప‌కుండా పాటించాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.

Next Story