Operation Sindoor: పాకిస్థాన్ కు డబుల్ స్ట్రోక్.. ఒకే రోజు ఆపరేషన్ సిందూర్.. మరోవైపు బలూచిస్తాన్ లో పాక్ సైనికులు ఖతం..

by Vennela |   (  Updated:2025-05-07 06:40:13  IST  )

Operation Sindoor: ఓవైపు భారత్ పాకిస్తాన్ ఫై ఆపరేషన్ సింధూర్ పేరిట క్షిపణులతో దాడులు చేయగా ఇప్పుడు మరోవైపు నుంచి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైతం సైతం పాకిస్తాన్ ఆర్మీ పై దాడులు చేసి దాయాది పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

Operation Sindoor: పాకిస్థాన్ కు డబుల్ స్ట్రోక్.. ఒకే రోజు ఆపరేషన్ సిందూర్.. మరోవైపు బలూచిస్తాన్ లో పాక్ సైనికులు ఖతం..
X

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: ఓవైపు భారత్ పాకిస్తాన్ ఫై ఆపరేషన్ సింధూర్ పేరిట క్షిపణులతో దాడులు చేయగా ఇప్పుడు మరోవైపు నుంచి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సైతం సైతం పాకిస్తాన్ ఆర్మీ పై దాడులు చేసి దాయాది పాకిస్తాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మే 7వ తేదీ అర్థరాత్రి 1.44 గంటలకు యుద్ధ విమానాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై 9 వేరు వేరు చోట్ల దాడులు చేసింది. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు పాకిస్థాన్ కు ఉక్కిరిబిక్కిరి చేసేలా భారత్ ప్లాన్ చేసిందని మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ కన్నా ముందే పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రాంతంలో యాక్టివ్ గా పని చేస్తున్న ఏర్పాటు వాద సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనిక వాహనాన్ని పేల్చి ఏడుగురు పాకిస్తాన్ జవాన్లను బలిగొంది. అయితే ఈ దాడి జరిగిన కొన్ని గంటలకే ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై క్షిపణులు దాడి జరిగింది.

అయితే వరుసగా జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భారత్ చేసిన ఈ చర్యను బదులు తీర్చుకుంటామంటూ ప్రకటించారు. మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటు వాదులు సైతం గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్మీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. బలూచిస్తాన్ పాకిస్థాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్టు ఈ ప్రాంతంలోనే ఉంది.

అలాగే ఈ ప్రాంతం ఇరాన్ తో సరిహద్దు భూభాగం పంచుకుంటోంది. ఇక్కడ చాలాకాలంగా వనరుల దోపిడీ జరుగుతోందని అందుకే తాము స్వతంత్ర దేశం కోసం పోరాటం చేస్తున్నామని అభివృద్ధికి తమ ప్రాంతం నోచుకోలేదని, పాకిస్తాన్లో అభివృద్ధి మొత్తం పంజాబ్ రాష్ట్రం కేంద్రంగానే జరిగిందని ఈ దోపిడీ నుంచి బయట పడాలంటే స్వతంత్ర దేశమే తమకు దిక్కని బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

Next Story