దోస్త్‌ మేరా దోస్త్.. మళ్లీ ట్రెండింగ్‌లోకి 'మెలోడీ'.. ఫొటో వైరల్

by Yella Dhawani Reddy |

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మూడు దేశాల పర్యటనలో భాగంగా కెనడా వెళ్లారు. అక్కడ నిర్వహించిన జీ7 సదస్సులో ఆయన పాల్గొన్నారు

దోస్త్‌ మేరా దోస్త్.. మళ్లీ ట్రెండింగ్‌లోకి మెలోడీ.. ఫొటో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మూడు దేశాల పర్యటనలో భాగంగా కెనడా వెళ్లారు. అక్కడ నిర్వహించిన జీ7 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో (Giorgia Meloni) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు నేతలు కరచాలనం చేసుకుని, ముచ్చటిస్తున్న ఫొటోను ఇటలీ ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి 'భారత్-ఇటలీల స్నేహబంధం దృఢంగా పెనవేసుకుపోయాయి' అని రాసుకొచ్చారు. ఈ పోస్టుపై మోదీ స్పందిస్తూ.. మెలోని చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నానని రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం సోషల్ మీడియాలో మరోసారి వైర‌ల్‌గా మారింది. ప్రస్తుతం #మెలోడీ (#Melodi) అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.

కాగా, మోదీ, మెలోనీలు దిగిన ఫొటోలు వైరల్ అవ్వటం కొత్తేమీ కాదు. గతంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ వేదికగా జరిగిన కాప్‌ 28 సదస్సు సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోని ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. మెలోడీ (Modi + Meloni) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అప్పటినుంచి ఈ #Melodi పదం ట్రెండ్‌ అయ్యింది. ఇక, గతేడాది ఇటలీలో జరిగిన జీ7 సదస్సులోనూ వీరు దిగిన సెల్ఫీ నెట్టింట చక్కర్లు కొట్టింది.

Next Story