- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-US: 'అమెరికాను నమ్మవద్దు': ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్
గతంలో తాను భారత్‌లో ఉన్న సమయంలో అమెరికాతో పెద్ద వాణిజ్య సంబంధాలను ఆశించవద్దని చెప్పాను.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా, భారత్ మధ్య నెలకొన్ని టారిఫ్ వార్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా తనను నిజమైన మిత్రదేశంగా భావిస్తుందని భారత్ భావిస్తే, అది తనను తాను మోసం చేసుకున్నట్టేనని హెచ్చరించారు. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌తో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన.. యూఎస్ సుంకాలు, నిలిచిపోయిన వాణిజ్య హామీలు స్పష్టమైన వాస్తవాలను ముందుంచుతాయి. అమెరికా రాజకీయ నేతలు భారత్ గురించి అస్సలు పట్టించుకోరు. భారతీయ ఆధారిత సరఫరాను నిర్మించాలనే ఆసక్తి కూడా లేదని జెఫ్రీ అభిప్రాయపడ్డారు. గతంలో తాను భారత్‌లో ఉన్న సమయంలో అమెరికాతో పెద్ద వాణిజ్య సంబంధాలను ఆశించవద్దని చెప్పాను. అయితే, చైనాకు ప్రత్యామ్నాయంగా అమెరికాకు మంచి భాగస్వామిగా ఉండాలని భారత్ భావించింది. దానిపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్పాను. అందుకు అగ్రరాజ్యం ఆసక్తి చూపడంలేదు. ముఖ్యంగా ట్రంప్ ఇందుకు దూరంగా ఉండవచ్చు. ఏ సందర్భంలోనైనా దీర్ఘకాలిక సంబంధాలకు ట్రంప్ అంగీకరించరని జెఫ్రీ సాక్స్ వివరించారు. చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ కూటమిలో అమెరికాతో కలిసి ఉండటం మంచిదని భారత్ భావించవచ్చు. కానీ భారత్ మెరుగైన ఆర్థిక శక్తిగా ఉంది. చైనాకు వ్యతిరేకంగానో, అమెరికాకు మద్దతుగానో నిలవాల్సిన అవసరంలేదు. బదులుగా పరస్పర గౌరవంతో అన్ని దేశాలతో సంబంధాలు కొనసాగించే లక్ష్యంతో పనిచేయాలి. అమెరికా, చైనా, రష్యా, ఆఫ్రికన్ దేశాలతో పాటు ఇతర ప్రాంతాలతో సంబంధాలను సమతుల్యం చేసుకోవడం మంచిదని ఆయన వెల్లడించారు.
అమెరికా-భారత్ వాణిజ్య చర్చల గురించి తాను మొదటి నుంచి సందేహం వ్యక్తం చేస్తున్నానని సాక్స్ అన్నారు. తాజా సుంకాల వ్యవహారం ఒక ప్రాథమిక వాస్తవారలను బహిర్గతం చేస్తోంది. అమెరికా లక్ష్యం ఆధిపత్యం కలిగి ఉండటం. ఇది ఒక భ్రమ. అమెరికా ప్రపంచ ఆధిపత్యం కాదు. అమెరికా మిగిలిన ప్రపంచాన్ని ఆదేశించే స్థితిలో లేదని సాక్స్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ రాజకీయాలు కాలం చెల్లిన ఆధిపత్య ఊహల్లో చిక్కుకున్నాయని ఆయన అభివర్ణించారు. ట్రంప్‌నకు మిత్రులు ఉండరు. వ్యూహాత్మక భాగస్వాములు లేరు. ట్రంప్ ఆలోచనా విధానం, స్వల్పకాలానికే కానీ మరే ప్రాధాన్యత ఉండదని జెఫ్రీ సాక్స్ పేర్కొన్నారు.






