- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తరచుగా పార్టీలు మారకండి: యువ రాజకీయ నాయకులకు వెంకయ్యనాయుడు సూచన
ఎల్లప్పుడూ పార్టీలు మారుతూ ఉంటే ప్రజలు రాజకీయాలపై ఆసక్తి కోల్పోతారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: యువ రాజకీయ వేత్తలు తరచుగా పార్టీలు మారొద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఎల్లప్పుడూ పార్టీలు మారుతూ ఉంటే ప్రజలు రాజకీయాలపై ఆసక్తి కోల్పోతారని ఇది ప్రజాస్వామ్యానికి హానికరమని తెలిపారు. 13వ భారతీయ ఛాత్ర సంసద్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘యువకులు రాజకీయాల్లో చేరండి. కానీ నిర్మాణాత్మకంగా, శ్రద్దగా పనిచేయండి. నిరంతరం పార్టీలు మారకండి. ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కావట్లేదు. ఇది ఆందోళన కరమైన విషయం’ అని చెప్పారు. ‘నేను దేశమంతా తిరుగుతున్నప్పుడు పలు సమావేశాల్లో కొందరు ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తారు. కానీ వారు ఇప్పుడు ఆ పార్టీలో లేరు అని పక్కనున్న వారు చెబుతుంటారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు’ అని చెప్పారు. నేను బీజేపీలో చేరి ఎంతో కాలం శ్రద్ధగా పని చేస్తేనే ఉప రాష్ట్రపతి పదవి వరించిందని తెలిపారు. వర్ధమాన రాజకీయ నాయకులు భావజాలానికి కట్టుబడి ఉండాలని చెప్పారు.






