- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్‌కు మరో దెబ్బ..అప్పు ఇవ్వద్దంటూ ఐఎమ్‌ఎఫ్‌కు భారత్ సూచన
పాకిస్థాన్(Pakistan)ను భారత్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటూ ఆ దేశ విమానాలకు ఎంట్రీ నిరాకరించిన సంగతి తెలిసిందే.

దిశ,వెబ్ డెస్క్: పాకిస్థాన్(Pakistan)ను భారత్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటూ ఆ దేశ విమానాలకు ఎంట్రీ నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దేశానికి అప్పు ఇవ్వద్దు అంటూ IMF (అంతర్జాతీయ ద్రవ్యనిధి)కి సూచించింది. పాకిస్థాన్‌కు నిధులు ఇస్తే వాటిని ఉగ్రవాదులకు మళ్లిస్తోందని భారత్ పేర్కొంది. దీనిపై మే9వ తేదీన ఐఎమ్ఎఫ్ బోర్డు చర్చించనుంది. ఇప్పటికే ఐఎమ్ఎఫ్ పాకిస్థాన్‌కు 7బిలియన్ డాలర్లు ఇవ్వడానికి ఆమెదం తెలిపింది.
ఇప్పుడు భారత్ నిధులు ఇవ్వొద్దని సూచించిన నేపథ్యంలో ఐఎంఎఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థికమాంద్యంతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రజలు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ పాక్ మాత్రం ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తూ వారికి మద్దతుగా నిలుస్తోంది. తాజాగా భారత్ ఇచ్చిన సూచనతో ఐఎంఎఫ్ నిధులు ఆపివేస్తే ఆ దేశ పరిస్థితి మరింత క్షీణించే అవకాశం ఉంది.






