‘మనుస్మృతి’తో సిగరెట్ వెలిగించుకున్న యువతి

by Harish |

బీహార్‌కు చెందిన ఓ యువతి మనుస్మృతి పుస్తకానికి నిప్పంటించి, ఆ మంటలతో సిగరెట్ వెలిగించుకుంది.

‘మనుస్మృతి’తో సిగరెట్ వెలిగించుకున్న యువతి
X

పాట్నా: బీహార్‌కు చెందిన ఓ యువతి మనుస్మృతి పుస్తకానికి నిప్పంటించి, ఆ మంటలతో సిగరెట్ వెలిగించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే, 27 ఏళ్ల సదరు యువతి పేరు ప్రియ దాస్. ఆర్జేడీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఆ వీడియోలో కట్టెల పొయ్యిపై చికెన్ వండుతూ, వాటి మంటలతో సిగరెట్ వెలిగించుకుంది.

దీనిపై మీడియా ప్రశ్నించగా, ఆమె స్పందిస్తూ, ‘మనుస్మృతి ప్రకారం మహిళ మద్యం సేవిస్తే, పలు రకాలుగా శిక్షించాలి. అయితే, శిక్షించే ముందు ఆమె కులాన్ని తప్పనిసరిగా నిర్ధారించాలి. ఇలాంటి కుల వివక్ష నచ్చలేదు. అందుకే తగులబెట్టాను. ‘మనుస్మృతిని తగులబెట్టడం ఒక చర్య మాత్రమే. ఎవరి మనోభావాలు కించపరచడం నా ధ్యేయం కాదు. బహుజన సమాజంలో చైతన్యం తీసుకురావడం, కపట ఆలోచనలపై దాడి చేయడమే నా లక్ష్యం. చాలా కాలం క్రితమే మనుస్మృతి దహనానికి అంబేద్కర్ పునాది వేశారు’ అని వెల్లడించారు.

నిజానికి, తాను మాంసాహారిని కాదని, సిగరెట్ అలవాటు లేదని, నిరసన తెలపడానికి మాత్రమే ఇలా చేశానని తెలిపారు. కాగా, సీటెట్ క్లియర్ చేసిన ప్రియా దాస్.. ప్రస్తుతం టీచర్ కొలువు కోసం సిద్ధమవుతున్నారు. పీహెచ్‌డీ చేసేందుకూ ప్రిపేర్ అవుతున్నారు.

Next Story