- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భయం వద్దు.. మీ బిడ్డను తీసుకోస్తాం! జై శంకర్
జర్మనీ లో అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారిని.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించేలా తగిన చర్యలు తీసుకుంటామని దేశ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: జర్మనీ లో అధికారుల సంరక్షణలో ఉన్న చిన్నారిని.. ఆమె తల్లిదండ్రులకు అప్పగించేలా తగిన చర్యలు తీసుకుంటామని దేశ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. మూడున్నరేళ్ల పాపతో పాటు ఆమె తల్లిదండ్రులను దేశానికి రప్పించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు ప్రారంభించిందని, అందుకు సంబంధించిన చట్టపరమైన చర్యలను చేపట్టిందని ఆయన వెల్లడించారు.
అయితే, ముంబై కి చెందిన దంపతులు 2018 లో ఉపాధి కోసమని జర్మనీ దేశానికి వెళ్లారు. ఆ దంపతులకు అక్కడే పాప జన్మించింది. ఒక రోజు పాప ఆడుకుంటూ కింద పడిపోగా.. ఆ పాపకు ప్రైవేట్ అవయవం దగ్గర గాయమైంది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, గాయమైన ప్రదేశాన్ని బట్టి ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానించారు. కాగా చిన్నారికి గాయం ప్రమాదవశాత్తు జరిగిందన్న తల్లిదండ్రుల వాదనను తోసిపుచ్చుతూ.. బెర్లిన్ లోని న్యాయస్థానం 2021 సెప్టెంబర్ లో పాప పూర్తి బాధ్యతలను జర్మనీ అధికారులకు అప్పగించింది. గత 36 నెలలుగా పాప వారి వద్దే ఉంటోంది. అయితే పాపను వారి తల్లిదండ్రులు ఎప్పటిలాగే కలవొచ్చని కోర్టు తెలిపింది. కాగా తమ పాపను దక్కించుకోవడానికి వారు శత విధాలుగా ప్రయత్నించినా, ఎటువంటి లాభం లేకపోవడంతో.. వారి తల్లిదండ్రులు 2023 లో మహారాష్ట్ర సీఎం ను కలిశారు. దాంతో ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్ కు చెప్పడంతో.. సదరు పాపను స్వదేశానికి పంపాలని జర్మనీని కోరింది. మరోవైపు మన దేశంలోని 19 పార్టీలకు చెందిన 59 మంది ఎంపీలు కూడా.. ఈ విషయంలో చొరవ తీసుకొని, పాపను భారత్ కు పంపాలని భారత్ లోని జర్మనీ దౌత్యవేత్తకు లేఖ రాశారు.
మరోసారి.. ఈ నెల(ఆగస్టు) ప్రారంభంలో మహారాష్ట్రలోని థానే ఎంపీ, పార్లమెంటులో ఇదే విషయాన్ని లేవనెత్తడంతో జై శంకర్ స్పందించారు. పాపను భారత్ కు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఇది మైనర్ కు సంబంధించిన విషయం కావడంతో దీనికి ఎక్కువ టైమ్ పడుతోందని అన్నారు. అయితే వారిని త్వరలోనే భారత్ కు తీసుకువస్తామని జై శంకర్ హామీ ఇచ్చారు.






