- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Istanbul: డిస్కౌంట్ అడగొద్దు బ్రదర్స్.. భారత్, పాక్ వాసులను ఉద్దేశిస్తూ బోర్డులు
టర్కీలోని ఇస్తాంబుల్ లో ఓ దుకాణం వద్ద బోర్డు వివాదానికి దారితీసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Turkey) టర్కీలోని ఇస్తాంబుల్ (Istanbul)లో ఓ దుకాణం వద్ద బోర్డు వివాదానికి దారితీసింది. ఇస్తాంబుల్లో దక్షిణాసియా ప్రజలకు ఎలాంటి తగ్గింపులు లేవని రాసి ఉన్న నోట్‌ను గుర్తించానని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. అందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సోదరులు.. దయచేసి డిస్కౌంట్లు అడగొద్దంటూ యజమాని బోర్డు పెట్టారు. పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం వైరల్ అవుతోంది. దీంతో ఆ దుకాణంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ ని కించపరిచే షాపులోనూ బిజినెస్ చేయకూడదని, భారత్ దెబ్బ ఏంటో టర్కీ కూడా తెలిసి రావాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. టూరిస్ట్‌లను చూసి ధరలు పెంచకపోతే.. తాము కూడా డిస్కౌంట్ అడగమని ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ పెట్టారు. అయితే ఈ దేశాలతో బేరం చేసి అలసిపోయారని, అందుకే డిస్కౌంట్ అడగవద్దని ముందే బోర్డు పెట్టినట్లు ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ పెట్టారు.






