- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు.. శాంతి చర్చల నుంచి ఇరాన్ బృందం వాకౌట్
స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్విట్జర్లాండ్‌లోని బర్గాన్‌స్టాక్ రిసార్ట్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక శాంతి చర్చలు ప్రారంభంలోనే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన సైనిక దాడి హెచ్చరికల నేపథ్యంలో, ఇరాన్ ప్రతినిధి బృందం చర్చల వేదిక నుంచి నిరసనగా వాకౌట్ చేసింది.
ఫొటో సెషన్‌ను తిరస్కరించిన ఇరాన్..
ఇటీవల కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం అమెరికా, ఇరాన్, పాకిస్థాన్, ఖతార్ దేశాల ప్రతినిధులు చర్చల కోసం సమావేశమయ్యారు. అయితే. అంతకు ముందే అమెరికా బృందంతో కలిసి జాయింట్ ఫొటో సెషన్, హ్యాండ్‌షేక్ చేయాలన్న ప్రతిపాదనను ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదంతా అమెరికా చేస్తున్న మీడియా షో అని కొట్టిపారేస్తూ వారు ఫొటో సెషన్‌ను స్కిప్ చేశారు. ఈ సమయంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పక్కపక్కనే నిలబడి మొత్తం పరిణామాలను గమనించారు.






