- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే ఇదే సరైన ఐడియా.. వైరల్‌గా మారిన తేజ సజ్జ కామెంట్స్
అన్ని సినిమాలను 3డీలో విడుదల చేస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు" అంటూ తేజ సజ్జ చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: తేజ సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హనుమాన్'. 2024 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 25న 3డీ వెర్షన్‌లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తేజ సజ్జ మాట్లాడుతూ, "జూన్ 25న మా 'హనుమాన్' సినిమా 3డీలో విడుదల కాబోతోంది.
అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను చూడండి. మీరు కచ్చితంగా థియేటర్‌కే రావాలి. ఎందుకంటే బయట 3డీ గ్లాసులు దొరకవు కదా! ఇదో మంచి ఆలోచన. అన్ని సినిమాలను 3డీలో విడుదల చేస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తేజ సజ్జ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్న 'హనుమాన్' చిత్రం 3డీ వెర్షన్‌లో ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.






