సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు: విచారణకు హీరో అల్లు అర్జున్‌ డుమ్మా

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-22 06:39:04  IST  )

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సహా 12 మందికి నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు: విచారణకు హీరో అల్లు అర్జున్‌ డుమ్మా
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు (Nampally Court) పరిగణనలోకి తీసుకుని, విచారణను అధికారికంగా ప్రారంభించింది. అయితే, ఇదే కేసులో 12 మంది నిందితులతో పాటు ఇప్పటికే కోర్టు నుంచి నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ముందే ఖరారైన ఒక సినిమా షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన ముంబైలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన వ్యక్తిగతంగా న్యాయమూర్తి ఎదుట విచారణకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది.

అయితే, గైర్హాజరుపై అల్లు అర్జున్ న్యాయవాదులు కోర్టులో ఓ కీలక పిటిషన్ దాఖలు చేశారు. ఇతర కారణాల వల్ల కోర్టు ఆన్‌లైన్ విచారణకు అనుమతించకపోతే.. వ్యక్తిగత హాజరు నుంచి మినాహాయింపు కోరుతూ ఆబ్సెంట్ పిటిషన్ (Absence Petition) వేశారు. ముంబై షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన ఇవాళ్టి విచారణకు హాజరుకాలేకపోయారని, జూలైన 6 విచారణకు కూడా వర్చువల్‌గానే హాజరవుతారని అందులో కోర్టుకు వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు మెమో దాఖలు చేయాలని ఆదేశించింది.

Next Story