ఇరాన్ - ఇజ్రాయెల్‌ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-01 16:35:23  IST  )

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

ఇరాన్ - ఇజ్రాయెల్‌ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక ప్రకటన చేశారు. దాడుల్లో 48 మంది ఇరాన్ కీలక నేతలు మరణించారని పేర్కొన్నారు. యూఎస్‌లోని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. "మేము సాధిస్తున్న విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు. కేవలం ఒక్క దెబ్బతో 48 మంది ఇరాన్ నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. ఆపరేషన్ చాలా వేగంగా, అత్యంత విజయవంతంగా ముందుకు సాగుతోంది" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అంతకుముందు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఇరాన్‌లో అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్య తాము అనుకున్న షెడ్యూల్ కంటే ముందే కొనసాగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు ట్రంప్ విజయోత్సాహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు పాకిస్తాన్‌లో ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి.

చర్చలకు సిద్ధం

చమురు ధరల పెరుగులపై ఎవరూ ఆందోలన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచానికి ఏది కరెక్టో అదే చేస్తున్నానని చెప్పారు. ఇరాన్ నేతలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్‌తో చర్చలకు నేనూ సిద్ధమే. ఇరాన్ ఈ పని ముందే చేసి ఉండాల్సింది అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Next Story