Trump: ఇరాన్ తో న్యూక్లియర్ డీల్ పై చర్చలకు అమెరికా రెడీ

by Shamantha N |

ఇరాన్(Iran) తో అణు ఒప్పందంపై (Nuclear Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ డీల్ పై చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Trump: ఇరాన్ తో న్యూక్లియర్ డీల్ పై  చర్చలకు అమెరికా రెడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్(Iran) తో అణు ఒప్పందంపై (Nuclear Deal) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ డీల్ పై చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెహ్రాన్ తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి లేఖ రాసినట్లు మీడియాకు చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఇరాన్‌ కు కేవలం రెండే మార్గాలున్నాయి. చర్చలు లేదా యుద్ధం. నా ప్రాధాన్యం మాత్రం ఒప్పందానికే. ఇరాన్ చర్చలు జరపుతుందని ఆశిస్తున్నా. ఇది ఆ దేశానికి ప్రయోజనకరం’’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ఇరాన్‌తో గతంలో అణు ఒప్పందం చేసుకున్న అమెరికా.. 2018లో ట్రంప్‌ హయాంలోనే దాన్నుంచి బయటకు వచ్చింది. కాగా.. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. కాగా.. వాటిని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంని నియంత్రణ గురించి రష్యా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు ప్రయపంచ ప్రయత్నాలను ఇరాన్ రాయబారితో చర్చించినట్లు రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ సెర్గీ ర్యాబ్కోవ్ తెలిపారు.

Next Story