- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పిన ట్రంప్.. ధన్యవాదాలు తెలిపిన ప్రధాని
ప్రధాని మోడీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బర్త్‌డే విషెస్ చెప్పారు. ఆయనకు మోడీ ధన్యవాదాలు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీకి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మదిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ వెల్లడించారు. ‘నా స్నేహితుడు ప్రధాని మోడీతో ఫోన్‌లో అద్భుతమైన సంభాషణ జరిగింది. తనకు హ్యాపీ బర్త్‌డే చెప్పా. ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారు. నరేంద్ర, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు మద్దతిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని ట్రంప్ పోస్టు చేశారు.
దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. ‘నాకు ఫోన్ కాల్ చేసి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు మిత్రమా ప్రెసిడెంట్ ట్రంప్. నేను కూడా నీలాగే భారత్-యూఎస్ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నా. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం దిశగా మీరు తీసుకునే చర్యలకు మా మద్దతు ఉంటుంది’ అని ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు.






