- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీల్ చేసుకోండి.. లేదా.. హమాస్‌కు ట్రంప్ మరో వార్నింగ్
గాజా డీల్‌ను త్వరగా పూర్తిచేయాలని హమాస్‌కు ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే హామీలన్నీ వెనక్కు తీసుకుంటానని బెదిరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: గాజా శాంతి ఒప్పందంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఈ ఒప్పందానికి హమాస్ అంగీకరించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ దళాలు గాజాపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్.. వెంటనే దాడులు ఆపేయాలని ఇజ్రాయెల్‌కు చెప్పారు. ఆ తర్వాత గాజాలో దాడులు జరగలేదని సమాచారం. ఈ క్రమంలో మరోసారి హమాస్‌ను హెచ్చరించిన ట్రంప్.. ‘శాంతి ఒప్పందం విషయంలో హమాస్ చురుగ్గా కదలాలి. లేదంటే అన్ని హామీలు వెనక్కు తీసుకుంటా’ అని వార్నింగ్ ఇచ్చారు. గాజాలో శాంతి కోసం 21 అంశాలతో అమెరికా ఒప్పందాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వీటిలో పలు అంశాలపై హమాస్ ప్రశ్నలు లేవనెత్తింది.
అయితే మెజార్టీ నిబంధనలకు హమాస్ అంగీకారం తెలపడంపై ట్రంప్ సంతోషం వ్యక్తంచేశారు. అదే సమయంలో గాజాపై దాడులు నిలిపివేసినందుకు ఇజ్రాయెల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘ బందీల విడుదల, శాంతి ఒప్పందానికి అవకాశం ఇచ్చేందుకు తాత్కాలికంగా దాడులు ఆపినందుకు ఇజ్రాయెల్‌కు కృతజ్ఞతలు. హమాస్ కూడా ఈ విషయంలో చురుగ్గా కదిలి, వేగంగా డీల్ చేసుకోవాలి. లేదంటే అన్ని హామీలు వెనక్కు తీసుకుంటా’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. గాజాలో శాంతి విషయంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందన్న వాదనలను ఖండించిన ట్రంప్.. పీస్ డీల్‌పై ఆలస్యం జరిగినా, మరోసారి గాజా ప్రమాదంగా మారినా తాను సహించేది లేదని తేల్చిచెప్పారు. అందర్నీ సమానంగా చూస్తానని, వెంటనే శాంతి ఒప్పందం చేసుకోవాలని పునరుద్ఘాటించారు.
ఈజిప్టులో చర్చలు..
గాజా శాంతి ఒప్పందంపై చర్చలు జరిపేందుకు హమాస్ ప్రతినిధులు కైరోకు చేరుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ నుంచి ట్రంప్ అల్లుడు జారెడ్ కుషన్నర్, స్టీవ్ విట్కాఫ్ కైరో బయల్దేరారు. గాజా డీల్ ప్రకారం ఇజ్రాయెల్, హమాస్ నుంచి బందీల విడుదల, స్థిరమైన శాంతికి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై ఈజిప్టు వేదికగా జర్చలు జరగనున్నాయి.






