- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Donald Trump: జన్మతః పౌరసత్వం రద్దుపై సుప్రీంకోర్టుకెక్కిన ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమవలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమవలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతేకాకుండా, జన్మతః పౌరసత్వం రద్దు కోసం పోరాడుతున్నారు. జన్మతః పౌరసత్వం రద్దుని నిలిపివేస్తూ ఫెడరల్ కోర్టులు తీర్పులిచ్చాయి. కాగా.. ఆ తీర్పులను సవాల్ చేస్తూ ట్రంప్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. తాత్కాలిక సొలిసిటర్ జనరల్ సారా హారిస్ ఈ పిటిషన్ సాధారణమైనదని చెప్పుకొచ్చారు. మూడు దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. అంతేగాక, జన్మతః హక్కు రాజ్యంగబద్ధమా..?కాదా..?అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు. ఈ ఆదేశాలు దేశ ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని రాజ్యంగపరమైన విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నాయన్నారు.
ట్రంప్ ఉత్తర్వులపై..
ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నాయి. మేరీల్యాండ్, మసాచుసెట్స్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. ఇటీవల ట్రంప్ సర్కారు తొలగించిన పలువురు ప్రొబేషనరీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆరు ఏజెన్సీలకు కాలిఫోర్నియాలో న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అక్రమ వలసలను నిరోధించడానికి, ప్రభుత్వ బడ్జెట్‌ను తగ్గించడానికి, సమాఖ్య శ్రామిక శక్తిని తగ్గించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా కోర్టుల్లో చట్టపరమైన ప్రతిష్టంభనను ఎదుర్కొంటున్నారు. కాగా.. ఇప్పటివరకు జన్మతః పౌరసత్వ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. అయితే, తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దీనికి బ్రేక్ పడింది. ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం.. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ.. శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు.
READ MORE ....
Donald Trump: గ్రీన్ ల్యాండ్ పై అమెరికా కన్ను






