నా టారిఫ్‌లు అడ్డుకుంటే గ్రేట్ డిప్రెషన్ తప్పదు: డొనాల్డ్ ట్రంప్

by Phanindra |

తను వేస్తున్న టారిఫ్‌ల వల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, ఇప్పుడు కోర్టు దీన్ని అడ్డుకుంటే గ్రేట్ డిప్రెషన్ తరహా నష్టం తప్పదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

నా టారిఫ్‌లు అడ్డుకుంటే గ్రేట్ డిప్రెషన్ తప్పదు: డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ దేశాలపై తను విధించిన సుంకాలను కోర్టులు అడ్డుకుంటే యూఎస్ ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా మారతాయని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను టారిఫ్ విధానాల వల్ల యూఎస్ స్టాక్ మార్కెట్లలో ప్రతిరోజూ భారీ లాభాలు వస్తున్నాయని, ఖజానాలోకి వేల కోట్ల డాలర్లు వచ్చి చేరుతున్నాయని ట్రంప్ చెప్పారు. తన విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్ ప్రభావం చూపుతున్నాయన్నారు.

ఇలాంటి సమయంలో కోర్టు కనుక తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే జరిగే ఆర్థిక నష్టం నుంచి తేరుకోవడం అసంభవం అని తేల్చిచెప్పారు. ‘అదే జరిగితే 1929లో చూసిన గ్రేట్ డిప్రెషన్ పరిస్థితులు చూస్తాం. ఈ ఒక్క నిర్ణయం వల్ల అమెరికా శక్తి, అధికారం, సంపద అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నా ప్రభుత్వంలో సాధించిన లాభాలన్నీ కనుమరుగవుతాయి’ అని ట్రంప్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు.

ఒకవేళ కోర్టులకు తన పాలసీ నచ్చకపోతే మొదట్లోనే వాటిని అడ్డుకోవాల్సిందని ట్రంప్ చెప్పారు. ఇప్పుడు చాలా గొప్పగా మారే అవకాశం యూఎస్ ముందుందని, ఇలాంటి సమయంలో తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోతామని అన్నారు. ‘మన దేశానికి గొప్పతనం దక్కాలి. అంతేకానీ సమస్యలు, వైఫల్యాలు, అవమానం కాదు. ఆ దేవుడే యూఎస్‌ను కాపాడాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Next Story