థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలు శాశ్వతంగా బంద్ చేస్తా: ట్రంప్

by Phanindra |

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలు శాశ్వతంగా బంద్ చేస్తానని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలు శాశ్వతంగా బంద్ చేస్తా: ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్ అధికారులపై కాల్పుల ఘటన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తను థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి యూఎస్‌కు వలసలను శాశ్వతంగా నిలిపివేస్తానని ప్రకటించారు. దీంతో యూఎస్ వ్యవస్థ తిరిగి రికవర్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం అమెరికా వచ్చే వారిపై ఎఫెక్ట్ పడుతుందని వారు అంటున్నారు. అమెరికా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ లాభాలను ఇమిగ్రేషన్ విధానం ఆక్రమించేసిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.

‘బైడెన్ తెచ్చిన లక్షలాది అక్రమ వలసలను రద్దు చేస్తాను. యూఎస్‌కు లాభం చేకూర్చని, ఈ దేశాన్ని ప్రేమించలేని వారందర్నీ తొలగిస్తాను. ఈ దేశపు పౌరులు కాని వారికి ఫెడరల్ లాభాలు, సబ్సిడీలును ఆపేస్తాను. దేశీయ శాంతికి భంగం కలిగించే వలసదారులను డీన్యాచురలైజ్ చేస్తాను. భద్రతా రిస్క్, వెస్టర్న్ సంప్రదాయాలతో సరితూగని విదేశీయులను డిపోర్ట్ చేస్తాం’ అని ట్రంప్ స్పష్టంచేశారు. బైడెన్ హయాంలో ‘ఆటోపెన్ అప్రూవల్స్’ జరిగాయని ఆరోపించిన ఆయన.. యూఎస్‌లో అక్రమంగా ఉన్న, శాంతికి భంగం కలిగించేవారిని తొలగించే లక్ష్యంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

‘కేవలం రివర్స్ ఇమిగ్రేషన్ మాత్రమే ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దగలదు. అమెరికా గౌరవించే విషయాలను ద్వేషించే, దొంగిలించే, హత్యచేసే, నాశనం చేసే వారికి తప్ప అందరికీ థ్యాంక్స్‌గివింగ్ పండుగ శుభాకాంక్షలు. ఈ శాంతికి భంగం కలిగించే వారు ఈ దేశంలో ఎక్కువ కాలం ఉండరు’ అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story