- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉక్రెయిన్‌కు తోమహాక్స్ ఇవ్వలేం.. పుతిన్‌తో కాల్ తర్వాత ట్రంప్ యూటర్న్
ఉక్రెయిన్‌కు తోమహాక్స్ ఇవ్వలేమని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పుతిన్‌తో కాల్ తర్వాత ఆయన ఇలా యూటర్న్ తీసుకోవడం గమనార్హం.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌కు శక్తిమంతమైన తోమహాక్ మిసైల్స్ అందించేందుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తటపటాయిస్తున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్ కాల్ తర్వాత ఈ మిసైల్స్ విషయంలో ట్రంప్ టోన్ మార్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీతో రెండు గంటలపైగా చర్చలు జరిపిన ట్రంప్.. తోమహాక్స్ ఇచ్చే విషయంలో వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఈ మిసైల్స్‌ను తమ వద్ద ఉన్న అత్యాధునిక డ్రోన్స్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాలని ఉక్రెయిన్ అనుకుంది.
ఈ మిసైల్స్ కనుక తమకు దక్కితే.. శాంతి చర్చలకు రష్యా దిగివచ్చేలా చేయొచ్చని ఆ దేశం భావించింది. అయితే తమ దేశ భద్రత కోసం ఈ మిసైల్స్‌ను అమెరికాలోనే ఉంచాలని అనుకుంటున్నట్లు జెలెన్స్‌కీకి ట్రంప్ స్పష్టంచేశారట. అదే సమయంలో ఈ మిసైల్స్ అవసరం లేకుండానే యుద్ధం ముగిసే అవకాశం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా కనుక ఉక్రెయిన్‌కు తోమహాక్స్ మిసైల్స్ అందిస్తే.. యుద్ధం పరిస్థితి మారదని, అదే సమయంలో యూఎస్-రష్యా బంధాలు నష్టపోతాయని పుతిన్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకున్నారని తెలుస్తోంది.






