- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రక్కులపై ట్రంప్ కన్ను.. దిగుమతులపై 25 శాతం సుంకాలు!
ట్రక్కులపై ట్రంప్ కన్ను.. దిగుమతులపై 25 శాతం సుంకాలు వేస్తూ నిర్ణయం. యూఎస్ తయారీదారులపై ప్రభావం పడకుండా క్రెడిట్ కొనసాగింపు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఆటోమొబైల్స్, ఇంజిన్ తయారు చేసే కంపెనీలకు డొనాల్డ్ ట్రంప్ ఊరటనిచ్చారు. ఈ సంస్థలకు అందించే క్రెడిట్‌ను పెంచుతూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ఆయన సంతకాలు చేశారు. అదే సమయంలో విదేశాల నుంచి దిగుమతయ్యే మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులు, వాటి విడి భాగాలపై 25 శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే దిగుమతి చేసుకునే బస్సులపై కూడా పది శాతం సుంకాలు వేస్తున్నట్లు తెలిపారు. నవంబరు 1 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది.
దేశ భద్రత కోసమే ఈ సుంకాలు వేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా.. ఈ నిర్ణయం వెనుక మరేదో కారణం ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే యూఎస్‌కు భారీగా మీడియా, హెవీ డ్యూట ట్రక్కులను ఎగుమతి చేసే దేశాల్లో మెక్సికో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత కెనడా, జపాన్, జర్మనీ, ఫిన్‌ల్యాండ్ ఉన్నాయి. ఇవేమీ కూడా అమెరికా భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించవని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఈ దేశాలపై అదనపు సుంకాలు వేయొద్దని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరింది. కానీ అమెరికా ప్రభుత్వం ఈ మాటలు పెడచెవిన పెట్టింది.
విదేశాల నుంచి వచ్చే అక్రమ పోటీ నుంచి అమెరికా కంపెనీలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సర్కారు తెలిపింది. దీనికోసమే యూఎస్‌లో అసెంబుల్ చేసే వాహనాలకు ఇచ్చే అప్పును కూడా ట్రంప్ ప్రభుత్వం పెంచింది. వాహనం ఖరీదులో 3.75 శాతం వరకు ఈ క్రెడిట్ లభిస్తుందని, దీంతో తయారీదారులపై సుంకాల భారం పెద్దగా ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రెడిట్ ఆప్షన్‌ను నెమ్మదిగా ముగించాలని ప్రభుత్వం అనుకుంది. కానీ తాజా నిర్ణయంతో దీన్ని 2030 వరకు కొనసాగించనున్నారు.






