- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్ వచ్చాక యూఎస్ నుంచి 1,563 భారతీయుల డిపోర్టేషన్
by Phanindra |
ట్రంప్ వచ్చాక యూఎస్ నుంచి 1,563 భారతీయుల డిపోర్టేషన్ జరిగిందని, ట్రంప్ తొలి టర్మ్‌లో 6 వేల మందికిపైగా భారతీయులు డిపోర్ట్ అయ్యారని విదేశాంగ శాఖ తెలిపింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి నుంచి మొత్తం 1563 మంది భారతీయులు యూఎస్ నుంచి డిపోర్ట్ అయ్యారు. ఈ వివరాలను భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘జనవరి 20 నుంచి బుధవారం వరకు మొత్తం 1563 మంది భారతీయులను యూఎస్ నుంచి డిపోర్ట్ చేశారు. వీరిలో చాలా మంది కమర్షియల్ విమానాల్లో తిరిగొచ్చారు’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. ట్రంప్ తొలి టర్మ్ అధ్యక్షుడిగా చేసిన 2017-2021 సమయంలో 6153 మంది భారతీయులను స్వదేశానికి పంపేశారని గతంలో విదేశాంగ శాఖ వెల్లడించింది. 2019లో అత్యధికంగా 2,042 మందిని వెనక్కు పంపినట్లు తెలిపంది. ఇక ఆ తర్వాత జోబైడెన్ అధ్యక్ష కాలంలో దాదాపు 3 వేల మంది భారతీయులను డిపోర్ట్ చేయడం గమనార్హం.
Next Story






