- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే..వందశాతం సుంకాలు: ట్రంప్ వార్నింగ్
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని 50 రోజుల్లో రష్యా ఆపాలని, లేదంటే ఆ దేశంపై వందశాతం సుంకాలు వేస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యాకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 50 రోజుల్లో ఈ యుద్ధం ఆపేయాలని, లేదంటే రష్యాపై తీవ్రంగా సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ‘50 రోజుల్లో ఈ యుద్ధంపై డీల్ కుదరకపోతే సెకండరీ టారిఫ్స్ విధిస్తాం. ఈ సుంకాలు పూర్తి వంద శాతం ఉంటాయి. ఇక అదే మా ముందున్న మార్గం’ అని ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు కూడా సరఫరా చేస్తామని చెప్పిన ఆయన.. ఈ యుద్ధం విషయంలో పుతిన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌పై ఇటీవలి కాలంలో రష్యా దాడులు తీవ్రతరం చేసిన క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇకనైనా ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి ఒప్పందాన్ని సీరియస్‌గా తీసుకోవాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ కూడా అన్నారు. గతవారం కూడా పుతిన్‌పై మండిపడ్డ ట్రంప్.. రష్యా అధ్యక్షుడి తీరుతో తనను ఏమాత్రం సంతోషంగా లేనని చెప్పారు. ‘పుతిన్ తీరుతో నేను ఏమాత్రం సంతోషంగా లేను. తను చాలామందిని చంపేస్తున్నాడు’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు.






