- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చక్కగా మాట్లాడి.. చీకటి పడ్డాక బాంబులు.. పుతిన్ తీరుపై ట్రంప్ అసహనం!
చక్కగా మాట్లాడి, చీకటి పడ్డాక బాంబులు వేస్తాడంటూ పుతిన్ తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపుతామని వెల్లడించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు తమ పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పంపుతామని ఆయన ప్రకటించారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్‌ను కలవడానికి ముందు ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు.
‘ఉక్రెయిన్‌కు పాట్రియాట్స్ పంపుతాం. వాళ్లకు ఇవి అత్యవసరం. అయితే ఎన్ని పంపుతామని ఏం నిర్ణయించలేదు. ఉక్రెయిన్ రక్షణ ఉపయోగాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ట్రంప్ చెప్పారు. ఇటీవలే ఉక్రెయిన్‌కు తాము నేరుగా ఎలాంటి ఆయుధాలు పంపబోమని, నాటో తమకు డబ్బులు చెల్లిస్తేనే ఉక్రెయిన్‌కు వెపన్స్ పంపుతామని యూఎస్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్న ట్రంప్.. పాట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సహా కొన్ని కీలకమైన ఆయుధాలు పంపుతామని, వీటికి ఉక్రెయిన్ పూర్తిగా చెల్లింపులు చేస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఇది తమకు బిజినెస్ అన్నారు.
అదే సమయంలో పుతిన్ తీరుపై కూడా అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. ‘పుతిన్ చాలామందికి ఆశ్చర్యం కలిగించాడు. ముందు చాలా చక్కగా మాట్లాడతాడు. చీకటి పడగానే అందరి మీదా బాంబులు వేస్తాడు’ అంటూ విమర్శించారు.






