- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చైనాలో అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్.. కాసేపట్లో షీ జిన్‌పింగ్‌తో కీలక భేటీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో ల్యాండ్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎట్టకేలకు చైనా (China)లో ల్యాండ్ అయ్యారు. ఇరు దేశాల మధ్య అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఆయన కాసేపట్లో భేటీ కానున్నారు. బీజింగ్ చేరుకున్న ట్రంప్‌కు చైనా వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్ ఘనస్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో వాణిజ్యం, భద్రత వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని డొనాల్డ్ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. అయితే, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో ట్రంప్ పర్యటన అత్యంత కీలకం కానుంది.
Next Story






