- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG BREAKING: ఖమేనీ చనిపోయారు.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మృతి చెందాడని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.

Donald Trump announces the death of Iran's Supreme Leader AliKhamenei
దిశ, వెబ్ న్యూస్: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'ఖమేనీ చనిపోయాడుస..అంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించారు. ఖమేనీ చరిత్రలోనే అత్యంత చెడ్డ వ్యక్తి అని పేర్కొన్నారు. తమ నిఘా నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని 'ఎక్స్'లో పోస్ట్ పెట్టారు.
అటు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ‘ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి’ అంటూ కామెంట్ చేశారు. ఖమేనీ ఉండే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబులు వేశామని.. ఆయన చనిపోయి ఉండొచ్చని వెల్లడించారు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు. అటు.. ఇజ్రాయెల్ మీడియా సైతం ఖమేనీ చనిపోయాడని, ఆయన మృతదేహం లభ్యమైందని వార్తలు వైరల్ చేస్తోంది. అయితే, ఈ వార్తల్ని ఇరాన్ విదేశాంగ మంత్రి ఖండించారు. తమ సుప్రీం లీడర్ ఇంకా బతికే ఉన్నాడని స్పష్టం చేశారు. కాగా ఇరాన్‌లో దుర్భర పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఇజ్రాయెల్ దాడుల్లో 201 మంది మృతి చెందారు.






