- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమిషా ప్రియ కోసం ఫ్రెండ్లీ ప్రభుత్వాలతో చర్చలు: విదేశాంగ శాఖ
నిమిషా ప్రియ కేసులో తాము చేయగలిగినంత చేస్తున్నామని, ఫ్రెండ్లీ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియ అంశంపై విదేశాంగ శాఖ మరోసారి వివరణ ఇచ్చింది. ‘ఇది చాలా సున్నితమైన అంశం. ప్రభుత్వం చేయగలిగినంత సహకారం అందిస్తోంది. ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు లీగల్ సహకారం అందించడంతోపాటు ఒక లాయర్‌ను కూడా అప్పాయింట్ చేశాం. ఆ కుటుంబానికి కాన్సులర్ విజిట్స్ అరేంజ్ చేశాం. పరిస్థితిని చక్కబెట్టేందుకు అక్కడి స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు.
అవతలి వారితో ఒప్పందం చేసుకునేందుకు కొంత సమయం దొరికేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ‘యెమెన్ ప్రభుత్వం జులై 16న అమలు చేయాల్సిన ఆమె మరణశిక్షను వాయిదా వేసింది. ఈ విషయంలో అన్ని మార్గాల్లో సహకారం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. భారత్‌తో సన్నిహిత సంబంధాలున్న ప్రభుత్వాల సహకారం తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం’ అని జైస్వాల్ వివరించారు.






