- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ఏటా లక్ష అగ్నివీర్ లను తీసుకోనున్న ఇండియన్ ఆర్మీ?
ఇండియన్ ఆర్మీ ఇకపై ప్రతి ఏటా సైన్యంలోకి లక్షమంది అగ్నివీర్ లను తీసుకునే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ఆర్మీ ఇకపై ప్రతి ఏటా సైన్యంలోకి లక్షమంది అగ్నివీర్ లను తీసుకునే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏడాదికి 45 వేల నుంచి 50 వేల మంది అగ్నివీర్ లను నియమించుకుంటుండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను లక్షకు పెంచడం ద్వారా సైన్యంలో బలం పెరుగుతుందని ఇండియన్ ఆర్మీ భావిస్తుందని తెలుస్తోంది. కరోనా సమయంలో ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ను నిలిపివేయడం వల్లే సైన్యం కొరత ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. 2020,2021 సంవత్సరాల్లో నియామకాలు చేపట్టలేదు. ఆ సమయంలోనే ఏడాదికి సుమారు 60 వేల నుంచి 65 వేల మంది సైనికులు రిటైర్మెంట్ తీసుకున్నారు.
2022లో నాలుగేళ్లకు అగ్నిపథ్ ప్రారంభమైంది. త్రివిధ దళాల్లో 46 వేల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ.. 2023 లెక్కల ప్రకారం.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో 1.55 లక్షల పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. రిటైర్మెంట్లు జరుగుతున్న సంఖ్యకు, నియామకాలు చేపడుతున్న సంఖ్యకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండటం కూడా సైన్యంలో భారీ కొరతకు ఒక కారణంగా తెలుస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఈ ఏడాదికి 1.8 లక్షలకు చేరినట్లు సమాచారం. 2022లో నియమించిన అగ్నివీర్ లకు వచ్చే ఏడాదితో నాలుగేళ్ల పదవీకాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లక్షమంది అగ్నివీరులను నియమించుకోవాలని ఇండియన్ ఆర్మీ సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది.






