Viral News : రాజస్థాన్ లో దారుణం.. కుమారుని ట్రీట్మెంట్ కోసం వెళితే

by Muthe.Rajitha |

రాజస్థాన్(Rajasthan) లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

Viral News : రాజస్థాన్ లో దారుణం.. కుమారుని ట్రీట్మెంట్ కోసం వెళితే
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్(Rajasthan) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుమారుని వైద్యం కోసం వెళితే తండ్రికి సర్జరీ చేశారు వైద్యులు(Doctors' Negligence). ఈ నిర్లక్ష్య ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది. కోటా వైద్య కళాశాలలో జరిగిన ఈ ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. కోటాకు చెందిన మనీశ్ పాంచాల్ అనే యువకుడు యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలయ్యి కోటా ప్రభుత్వ వైద్య కాలేజీలో వైద్యం కోసం చేరాడు. అయితే ఆసుపత్రిలో మనీశ్ కు తోడుగా అతడి తండ్రి జగదీష్ ఉన్నాడు. అయితే అక్కడి డాక్టర్లు మనీష్ చేతికి సర్జరీ చేయాల్సి ఉండగా.. జగదీష్ కు సర్జరీ చేశారు. అయితే తండ్రి చేతికి కుట్లు ఉండటం చూసి గమనించి.. వైద్యులను నిలదీయగా.. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మనీష్.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని, వైద్యుల నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story