- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంటిచూపు సరిగ్గా లేదని డాక్టర్ దగ్గరికెళ్తే.. కంటిలోపలున్నది చూసి షాక్
కంటిచూపు సరిగ్గా లేదని వైద్యుడి దగ్గరకు వెళ్లాడొక వ్యక్తి. అక్కడ వైద్యులు అతని కళ్లను పరీక్షించగా కంటిలోపల ఒక పరాన్నజీవి పాములా కదులుతూ కనిపించింది.

దిశ, వెబ్‌డెస్క్: కంటిచూపు సరిగ్గా లేదని వైద్యుడి దగ్గరకు వెళ్లాడొక వ్యక్తి. అక్కడ వైద్యులు అతని కళ్లను పరీక్షించగా కంటిలోపల ఒక పరాన్నజీవి పాములా కదులుతూ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన డాక్టర్లు షాకయ్యారు. మధ్యప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఈ వింత అనుభవం ఎదురైంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన వివరాల ప్రకారం.. బాధిత వ్యక్తికి కళ్లు మసకబారుతుండటంతో వైద్యుల్ని సంప్రదించాడు. అతనికి ఫండోస్కోపీ చేయగా కంటిలోపల ఒక పరాన్నజీవి కనిపించింది.
ఆ పురుగును గ్నాథోస్టోమా స్పినిగెరమ్ గా గుర్తించారు. ఇవి ఎక్కువగా పిల్లులు, కుక్కల కళ్లలో కనిపిస్తాయని, సరిగ్గా ఉడకని చేపలు, చికెన్, కప్పల మాసం, పాములు తినడం వల్ల ఈ వ్యాధి వస్తుందని తెలిపారు. దాంతో బాధితుడు సైతం తాను సరిగ్గా ఉడకని మాంసం తిన్నట్లుగా అంగీకరించాడు. వెంటనే పార్స్ ప్లాన్ విట్రెక్టమీ చేసి ఆ పురుగును తొలగించారు. ఇవి కంటి రెటీనాలోకి చేరితే శాశ్వతంగా చూపును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.






