- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొమ్మిది మంది సంతానం ఉన్నా మళ్లీ అదే పని.. వైద్యులు ఏం చేశారంటే..!
తొమ్మిది మంది సంతానం ఉన్నా మళ్లీ గర్భం దాల్చిన మహిళలకు వైద్యులు కౌన్సింగ్ ఇస్తున్నారు..

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ నియంత్రణపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కొన్ని కుటుంబాల్లో మార్పులు రావడం లేదు. ఇద్దరు, ముగ్గురు కంటే పిల్లలను కంటున్నారు. ఓ కుటుంబం ఏకంగా తొమ్మది మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరో సంతానికి రెడీ అవుతున్నారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. నామక్కల్ జిల్లా పెరియకొల్లపట్టికి చెందిన గోపి, సంగీతకు 15 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. వారికి తొమ్మిది మంది సంతానం కలిగారు. వీరిలో ఒకరు మృతి చెందారు. మరో చిన్నారిని దత్తత తీసుకున్నారు. అయితే సంగీత మళ్లీ గర్భం దాల్చారు. ఈ విషయం స్థానిక వైద్యులకు తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనలతో సంగీత మల్లసముద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇంతలోనే ఆమె మనసు మార్చుకున్నారు. అబార్షన్ చేయించుకోకుండా ఇంటికి వెళ్లింది. దీంతో సంగీతకు వైద్యులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.






